పత్తి రైతుకు దళారుల బెడద
క్వింటాకు రూ.3 వేలు నష్టపోతున్న వైనం
త్రిపురాంతకం మండలంలో పత్తి పంట
ఖరీఫ్‌లో సాగు చేసిన వివిధ పంటలను చీడపీడలు చుట్టుముట్టడంతో దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు నష్టాలు చవి చూశారు. ఈ నేపథ్యంలో వేసవిలో పత్తి సాగు చేపట్టిన రైతులకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే జిల్లాలో ఖరీఫ్‌లో 28,959 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. రబీ సీజన్ నుంచి ఏప్రిల్ వరకు 10వేల ఎకరాల్లో ఉంది. సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోని బోరు బావులతో పాటు మెట్ట ప్రాంతంలోని బోర్ల కింద సైతం ఎక్కువగా వేశారు. ప్రధానంగా త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి, కంకణాపల్లి, బొంకూరివారిపాలెం, మేడపి, విశ్వనాథపురం, ఎండూరివారిపాలెం, గొల్లపల్లి, అన్నసముద్రం, నడిగడ్డ తదితర గ్రామాల్లో దాదాపు 2 వేల ఎకరాల్లో కనిపిస్తుంది. తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, కురిచేడు మండలాల్లో సైతం అధిక విస్తీర్ణంలో వేశారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలో తొలి విడత పత్తి తీసి రైతులు విక్రయిస్తున్నారు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తీతలు ఆరంభమై చేతికి పంట రానుంది. పత్తి క్వింటా ధర బహిరంగ మార్కెట్లో రూ.14 వేలు పలుకుతోంది. దళారులు గ్రామాల్లో మాయమాటలు చెప్పి, రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటూ క్వింటా రూ.11 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు సిండికెట్‌గా మారి తగ్గిస్తుండటంతో నిల్వ సౌకర్యం లేని రైతులతో పాటు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినవారు సైతం ఎంతోకొంతకు తెగనమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుకు క్వింటాకు గరిష్టంగా పదకొండు వేలకు మించి లభించడం లేదు. ఫలితంగా రూ.3 వేలు కోల్పోవాల్సి వస్తోంది. అదేమని అడిగితే సీసీఐ ప్రకటించిన ధర కంటే అధికంగానే ఇచ్చి కొంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
* భారత్ నుంచి ఇతర దేశాలకు పత్తి ఎగుమతి పెరిగింది. పాలిస్టర్ వాడకం తగ్గడం కూడా పత్తి ధరలు పెరగడానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.
కొనుగోలు చేసిన పత్తిని లారీకి ఎత్తుతున్న కూలీలు
ఇంట్లోనే నిల్వ ఉంచా
బోరు బావి కింద అయిదెకరాల్లో పత్తి వేశాను. ఇటీవల తొలి తీత తీయగా దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బహిరంగ మార్కెట్లో క్వింటా ధర దాదాపు రూ.14 వేలు పలుకుతుండగా రూ.10,500లకు అడుగుతున్నారు. తక్కువ ధరకు విక్రయించలేక ఇంట్లో మండి కట్టి నిల్వ ఉంచా- పసుపులేటి సుధాకర్, సోమేపల్లి, త్రిపురాంతకం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Presidential Election: నామినేషన్ వేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
-
General News
Telangana news: 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ranga Ranga Vaibhavanga: ‘ఖుషి’ని గుర్తుచేస్తోన్న ‘రంగ రంగ వైభవంగా’ టీజర్
-
World News
Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!
-
General News
CM Jagan: అందుకే 75% హాజరు తప్పనిసరి చేశాం: సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు