logo

ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. ఈ ఉదంతం మండలంలోని నేలటూరులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాం తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ సమస్యల నేపథ్యంలో నేలటూరుకు చెందిన

Published : 21 May 2022 06:34 IST


అంజిబాబును తీసుకొస్తున్న ఎస్సై శ్రీరాం

మద్దిపాడు, న్యూస్‌టుడే: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. ఈ ఉదంతం మండలంలోని నేలటూరులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాం తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ సమస్యల నేపథ్యంలో నేలటూరుకు చెందిన అంజిబాబు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకునేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం ఈ విషయాన్ని అతని సోదరుడు సుధాకర్‌కు ఫోన్‌ ద్వారా తెలిపాడు. ఆందోళన చెందిన సుధాకర్‌ విషయాన్ని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీరాం వెంటనే స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో అంజిబాబు చరవాణి సిగ్నల్స్‌ వస్తున్న ప్రాంతాన్ని గుర్తించి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అంజిబాబును గుర్తించి వెంటనే మద్దిపాడు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుట పడింది. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు