logo

ప్రణాళికతోనే విజయం

ఉన్నత ఆశయం, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందుకు సాగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంపికచేసిన విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒంగోలు బండ్లమిట్ట బాలికల ఉన్నత పాఠశాల

Published : 22 May 2022 03:06 IST

 ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’లో విద్యార్థులకు సూచన


విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉన్నత ఆశయం, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందుకు సాగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంపికచేసిన విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒంగోలు బండ్లమిట్ట బాలికల ఉన్నత పాఠశాల నుంచి 18 మంది, డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాల నుంచి ఆరుగురు హాజరయ్యారు. వారి అభిరుచి, భవిష్యత్‌ ప్రణాళికలపై ఆరా తీశారు. ఆశయాలకు తగ్గట్టు సాధన చేయాలని.. బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. విజయానికి ప్రణాళిక ముఖ్యమని.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు తాను చదువుకున్న తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాన్ని వివరించారు. అనంతరం స్ఫూర్తిదాయక అంశాలతో కూడిన పుస్తకాలను వారికందించారు. పాఠశాల విద్య డైరెక్టరేట్‌ సమన్వయకర్త పార్వతి, డీఈవో విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  
‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ సమయం పెంపు
ప్రతి సోమవారం ఉదయం నిర్వహిస్తున్న ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని ఇక నుంచి గంటపాటు నిర్వహించాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇకపై 10 నుంచి 11 వరకు నిర్వహిస్తారని డీఆర్వో పులి శ్రీనివాసులు తెలిపారు. జిల్లా అధికారులంతా ఉదయం 9.45 గంటలలోపు స్పందన సమావేశ మందిరానికి చేరుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. సమస్యలపై ప్రజలు టోల్‌ ఫ్రీ నంబరు 1077కు ఫోన్‌ చేసి తెలియజేయాలని ఓ ప్రకటనలో తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని