logo

‘మహానాడు’ పనులు ముమ్మరం

ఒంగోలు మండలం మండువవారిపాలెం సమీపంలో ఈ నెల 27, 28న జరగనున్న తెదేపా మహానాడుకు సంబంధించి వేదిక ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 85 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణం నిర్మించేలా ఇప్పటికే ప్రణాళిక చేశారు. శ

Published : 22 May 2022 03:06 IST


 పరిశీలిస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత,
తెదేపా నాయకులు దామచర్ల జనార్దన్, సంధ్యారాణి, నూకసాని బాలాజీ తదితరులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు మండలం మండువవారిపాలెం సమీపంలో ఈ నెల 27, 28న జరగనున్న తెదేపా మహానాడుకు సంబంధించి వేదిక ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 85 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణం నిర్మించేలా ఇప్పటికే ప్రణాళిక చేశారు. శనివారం షెడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ట్రషర్లను ఏర్పాటుచేశారు. ఈ నెల 25వ తేదీకల్లా పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళిక చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, జి.సంధ్యారాణి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ బాధ్యుడు పమిడి రమేష్, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, నగరపార్టీ అధ్యక్షురాలు పసుపులేటి సునీత, నేతలు టి.అనంతమ్మ నాళం నరసమ్మ, ఆర్ల వెంకటరత్నం పాల్గొన్నారు.
అన్ని డివిజన్లలో ఆహ్వానపత్రాలు 
మహానాడు కార్యక్రమానికి రావాలంటూ నగర తెదేపా మహిళల ఆధ్వర్యంలో ఒంగోలులోని అన్ని డివిజన్లల్లో శనివారం ఇంటింటా తిరిగి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు.. బొట్టు పెట్టి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు
ఏర్పాట్లపై సమీక్ష
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మహానాడు సభా వేదిక, వసతులు, భోజనాల ఏర్పాటుపై చర్చించారు. ఆ రోజున ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలపై మరోసారి సమీక్షించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, నియోజకవర్గాల బాధ్యులు పమిడి రమేష్, ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌.విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, గూడూరి ఎరిక్షన్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, సాయికల్పనారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 


వేదిక పనులు చేపడుతున్న దృశ్యం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని