logo

315 గ్రామాల్లో భూముల రీసర్వే

భూవివాదాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మొదలైన జగనన్న శాశ్వత భూహక్కు పథకం పనులు జిల్లాలో 315 గ్రామాల్లో జరుగుతున్నాయి. తొలుత డివిజన్‌ పైలెట్‌ ప్రాజెక్టుల కింద మూడు ప్రాంతాల్లో పనులు పూర్తిచేసిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి

Published : 22 May 2022 03:06 IST

ఈనాడు డిజిటల్, ఒంగోలు: భూవివాదాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మొదలైన జగనన్న శాశ్వత భూహక్కు పథకం పనులు జిల్లాలో 315 గ్రామాల్లో జరుగుతున్నాయి. తొలుత డివిజన్‌ పైలెట్‌ ప్రాజెక్టుల కింద మూడు ప్రాంతాల్లో పనులు పూర్తిచేసిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. తర్వాత మండలం పైలెట్‌గా తీసుకుని 29 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం కలికివాయి(సింగరాయకొండ), కలజువ్వలపాడు (తర్లుపాడు), సీతారామపురంలో పనులు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా 38 మండలాల్లోని 209 గ్రామాల్లో మొదటి విడత డ్రోన్‌ ద్వారా పరిశీలన కార్యక్రమాలు చేపట్టారు. రెండునెలల్లో మొదటివిడత రీసర్వే పూర్తి చేసి ఆయా మండలాల్లో రెండు, మూడు దశల పనులు కూడా ప్రారంభించి వచ్చే ఏడాదికి పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు వందశాతం పూర్తయిన కొన్ని గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. రీసర్వే సరిగా జరగలేదని, సరిహద్దు రాళ్లు పాతలేదని.. పాసు పుస్తకాలు, రికార్డుల్లో ఉన్న భూమికంటే తక్కువ వచ్చిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై 10-1, 92 నోటీసులు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నా రైతుల్లో అసంతృప్తి ఉంది.

వాస్తవ వివరాలు తెలియజేశాం
జిల్లాలో తొలుత రీసర్వే చేపట్టిన మూడు పైలెట్‌ గ్రామాల్లో వందశాతం పనులు పూర్తయ్యాయి. రీసర్వే ప్రకారం ఉన్న వాస్తవ భూమి వివరాలను రైతులకు తెలియజేశాం. ఇంకోసారి కొలిచినా అవే కొలతలు వస్తాయి. మరోసారి రీసర్వే ఉండదు. ఇంకా రైతులకు అభ్యంతరాలు ఉంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అన్ని మండలాల్లో మరో రెండు నెలల్లో మొదటి విడత రీసర్వే పూర్తి చేసి తర్వాత రెండు, మూడు దశలు ప్రారంభిస్తాం.
-కె.గౌస్‌ బాషా, ఏడీ, సర్వే-భూకొలతలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని