logo

టమోటా ధర పైపైకి

వంటింటి కూరగాయల్లో కీలకమైన టమోటా ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. వారం వ్యవధిలోనే అకాశాన్నంటడంతో బెంబేలెత్తుతున్నారు. గత నెలలో కిలో రూ.20 అమ్మిన టమోటా నేడు కొన్నిచోట్ల రూ.120కు చేరింది. రైతు బజార్లలో

Published : 24 May 2022 02:20 IST

రైతుబజార్లలో కిలో రూ.100

లాయర్‌పేట రైతు బజార్‌

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వంటింటి కూరగాయల్లో కీలకమైన టమోటా ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. వారం వ్యవధిలోనే అకాశాన్నంటడంతో బెంబేలెత్తుతున్నారు. గత నెలలో కిలో రూ.20 అమ్మిన టమోటా నేడు కొన్నిచోట్ల రూ.120కు చేరింది. రైతు బజార్లలో రూ.100 కు విక్రయిస్తున్నారు. జిల్లాలో రోజుకు 30 టన్నుల టమోటా వినియోగం ఉంటుందని మార్కెటింగ్‌ శాఖ అంచనా. ఒంగోలులో మూడు రైతు బజార్లు ఉండగా అక్కడా నిల్వలు అరకొరగానే ఉన్నాయి. ఇతర కూరగాయల్లో బీర కిలో రూ.60, పెద్దచిక్కుళ్లు రూ.70 ఉండగా బీన్స్‌ మాత్రం టమోటా మాదిరే రూ.120 పలుకుతోంది.

మదనపల్లి, పలమనేరు నుంచి టమోటా జిల్లాకు వస్తుంది. కొన్ని సీజన్లలో గిద్దలూరు, మార్టూరు ప్రాంతాల్లో సాగుచేస్తారు. వేసవిలో ఇక్కడ వాతావరణం అనుకూలించక పంట వేయలేదు. చిత్తూరు జిల్లాలో అకాల వర్షం పడటం వల్ల టమోటా పంట దెబ్బతిన్నట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దాదాపు రాష్ట్రంలో అన్నిచోట్ల ధర పెరిగింది. మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఉపేంద్ర మాట్లాడుతూ నేరుగా పంట పండించే చోట కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. రెండు మూడు రోజుల్లో కనీసం జిల్లాకు కొంతైనా తీసుకొచ్చి విక్రయించాలని ప్రయత్నం చేస్తున్నామని.. 10 టన్నులు కావాలని కోరినట్లు తెలిపారు. కొత్తగా వేసిన తోటలు కాపునకు వస్తున్నందున వారం, పదిరోజుల్లో ధర దిగి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఉల్లి ధర రూ.25 నుంచి రూ.30 మధ్య ఉందని, ఇతర కూరగాయల ధరలు పెద్దగా పెరగలేదన్నారు. ఇటీవల నూనె ధర పెరగడంతో బయట కన్నా రైతు బజార్లలో రూ.20 తక్కువ ధరకు విక్రయించడం జరిగిందన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని