logo

పెరిగిన ధరలకు నిరసనగా 30న ధర్నా

పెరిగిన ధరలు, పన్ను భారాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 30న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అంజయ్యరోడ్డులోని కాపు కల్యాణ మండపంలో సోమవారం

Published : 24 May 2022 02:20 IST

ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, వేదికపై ఇతర నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెరిగిన ధరలు, పన్ను భారాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 30న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అంజయ్యరోడ్డులోని కాపు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన సీపీఎం ప్లీనంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... కార్పొరేట్లకు లాభాలు చేకూర్చుతూ, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడం అన్యాయమన్నారు. ప్రకాశంను వెనుకబడిన జిల్లాగా గుర్తించి రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనను పూర్తిగా విస్మరించిందన్నారు. అర్హులైన పేదలకు మూడెకరాల భూమి, స్థలంతో పాటు ఇంటి నిర్మాణం, సామాజికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సుబాబుల్‌, జామాయల్‌ కర్ర కొనుగోలు తదితర డిమాండ్లతో తీర్మానాలు ఆమోదించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు, నాయకులు జీవీ.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, వై.సిద్దయ్య, జాలా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక...: సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా ఎస్‌డీ.హనీఫ్‌, కార్యదర్శి వర్గ సభ్యులుగా పునాటి ఆంజనేయులు, ఎస్‌.కె.బాబు, జీవీ.కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, ఎం.రమేష్‌, డి.సోమయ్య, వి.ఆంజనేయులు, ఊసా వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని