logo

462 పాఠశాలల్లో నాడు-నేడు

నాణ్యమైన విద్యతో పాటు... విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. నాడు - నేడు రెండో దశ పనులు, చదవడం మాకిష్టం... కార్యక్రమాలపై డీఈవో

Published : 25 May 2022 06:29 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నాణ్యమైన విద్యతో పాటు... విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. నాడు - నేడు రెండో దశ పనులు, చదవడం మాకిష్టం... కార్యక్రమాలపై డీఈవో విజయభాస్కర్‌ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 462 పాఠశాలల్లో రెండో దశ నాడు - నేడు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రధానోపాధ్యాయులు స్థానికంగా ఉండి... తల్లిదండ్రుల కమిటీ, మేస్త్రీ, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ పనులను పర్యవేక్షించాలన్నారు. నిర్మాణ సామగ్రికి కొరత లేదన్నారు. రెండో దశలో అభివృద్ధి పనులతో పాటు... అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవకాశం కలిగిందన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రస్తుత వేసవి సెలవులను అందుకు వినియోగించుకోవాలన్నారు. పిల్లలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చదవడంలో మెలకువలు తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు సమర్థంగా విధులు నిర్వహించడంతో... ఒకటి రెండు ఘటనలు మినహా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూఐడీసీ ఈఈ భాస్కర్‌బాబు, ఎంఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు