logo

ఎన్నికలొస్తున్నాయి... పోతున్నాయి.. రోడ్డేదీ?

‘అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి..పోతున్నాయి.. మా గ్రామంలో ప్రజలు రాకపోకలు సాగించే రహదారి మాత్రం నిర్మాణం కాలేదు..ఎన్నాళ్లీ అవస్థలు’ అంటూ మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని బోడపాడులో మహిళలు పశ్నించారు. మంగళవారం ఇక్కడ ‘గడప

Published : 25 May 2022 06:29 IST

నాగార్జునరెడ్డికి మహిళల ప్రశ్న

‘అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి..పోతున్నాయి.. మా గ్రామంలో ప్రజలు రాకపోకలు సాగించే రహదారి మాత్రం నిర్మాణం కాలేదు..ఎన్నాళ్లీ అవస్థలు’ అంటూ మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని బోడపాడులో మహిళలు పశ్నించారు. మంగళవారం ఇక్కడ ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఎం.సుబ్బమ్మ, తిరుపతమ్మ, చిన్నమ్మి మాట్లాడుతూ తమ వీధిలో తప్ప గ్రామంలో అన్ని చోట్లా సీసీ రోడ్లు నిర్మించారన్నారు. స్థానిక నాయకులు సమస్యను పట్టించుకోలేదన్నారు. రహదారి కోసం స్థలం కూడా ఇచ్చామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సర్పంచి రమణారెడ్డితో మాట్లాడారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఇప్పుడు సమస్యలను ప్రస్తావించవద్దంటూ కొందరు నాయకులు చెబుతున్నారని ఇంకొందరు మహిళలు ఆరోపించారు. -న్యూస్‌టుడే, మార్కాపురం గ్రామీణం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని