logo

ప్రశ్నిస్తే కొడతారా..!

‘నా కుమారుడిపై వైకాపా నాయకుడు చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి’ అంటూ ఓ రైతు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. దర్శి మండలం బొట్లపాలెంలో మంగళవారం ‘గడప గడపకు ప్రభుత్వం’ నిర్వహించారు. సంగటి కోటిరెడ్డి అనే రైతు ఆయనను నిలదీశారు.

Published : 25 May 2022 06:29 IST


 దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టిని నిలదీసిన రైతు

‘నా కుమారుడిపై వైకాపా నాయకుడు చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి’ అంటూ ఓ రైతు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. దర్శి మండలం బొట్లపాలెంలో మంగళవారం ‘గడప గడపకు ప్రభుత్వం’ నిర్వహించారు. సంగటి కోటిరెడ్డి అనే రైతు ఆయనను నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. కోటిరెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి ఒంగోలులో ఎమ్మెల్యేకు చెందిన ‘పేస్‌’ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిధి దాటి ప్రవర్తించారని తొమ్మిది మందిని యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. వారిలో కృష్ణారెడ్డి ఒకరు. మంగళవారం కృష్ణారెడ్డి సోదరుడు, స్థానిక నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన అన్నను ఎందుకు సస్పెండ్‌ చేశారని ప్రశ్నించడంతో ఓ నాయకుడు చేయి చేసుకున్నారని తండ్రి కోటిరెడ్డి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. తానూ వైకాపాకు ఓటేశానని.. ప్రశ్నిస్తే చేయి చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ కళాశాలలో పలువురిని సస్పెండ్‌ చేశారని.. ఏదైనా విషయం ఉంటే దర్శి వచ్చి మాట్లాడాలని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. - న్యూస్‌టుడే, దర్శి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని