logo

మహానాడుకు బస్సులిచ్చేందుకు ససేమిరా

మహానాడుకు కనిగిరి నుంచి నుంచి తెదేపా శ్రేణులు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించగా అధికారులు ససేమిరా అన్న వైనమిది. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

Published : 25 May 2022 06:29 IST

కనిగిరి, న్యూస్‌టుడే: మహానాడుకు కనిగిరి నుంచి నుంచి తెదేపా శ్రేణులు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించగా అధికారులు ససేమిరా అన్న వైనమిది. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 50 ఆర్టీసీ బస్సులు కావాలని స్థానిక ఆర్టీసీ డీఎం రామకృష్ణకు లేఖ రాశారు. పెళ్లిళ్ల సీజన్‌ అయినందుకు ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని, బస్సులు ఇవ్వడం వీలుకాదని అటు నుంచి సమాధానం వచ్చింది. దీనిపై ఉగ్ర స్పందిస్తూ..ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ యాజమాన్యం కొర్రీలు పెడుతుందని.. అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది చేస్తున్నారన్నారు. బస్సులు అద్దెకు ఇవ్వని విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలో 30 వరకు పైవేటు పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. మహానాడుకు బస్సులు ఇవ్వవద్దంటూ జిల్లా ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని కొన్ని యాజమాన్యాలు తెలపడం గమనార్హం. పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు వస్తున్నాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని