logo

అడ్డదారుల్లో కాదు... నేరుగా వస్తే తేల్చుకుందాం!

అభివృద్ధిలో పథంలో దూసుకుపోతున్న తనను నేరుగా ఏమీ చేయలేక... కళాశాలను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ విమర్శించారు. అడ్డదారుల్లో కాకుండా నేరుగా వస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు.

Published : 25 May 2022 06:29 IST

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి సవాల్‌


విద్యుత్తు ప్రభపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేణుగోపాల్‌

దర్శి, న్యూస్‌టుడే: అభివృద్ధిలో పథంలో దూసుకుపోతున్న తనను నేరుగా ఏమీ చేయలేక... కళాశాలను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ విమర్శించారు. అడ్డదారుల్లో కాకుండా నేరుగా వస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. తూర్పుచౌటపాలెం తిరునాళ్ల సందర్భంగా వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ప్రభపై సోమవారం రాత్రి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దర్శిలో పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ పలుమార్లు తనను పిలిచి అడిగారని... అందుకే బరిలోకి దిగి గతంలో ఎవరూ సాధించనంత మెజారిటీతో విజయం సాధించానని పేర్కొన్నారు. ఈ మూడేళ్లకాలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు. ఇంత చేస్తున్నా కొందరు పనిగట్టుకుని... తన కుటుంబం, సంస్థలపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఎవరి పదవీ లాక్కోలేదని, ఎవరికీ అన్యాయం చేయలేదని... స్వశక్తితో ఈ స్థాయికి వచ్చానన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని... లేదంటే పార్టీ నాయకుడిగా సేవలందిస్తానని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని