logo

చెంచులకు మెరుగైన వైద్యం

అనారోగ్యంతో బాధపడుతున్న చెంచు గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి వైద్యులకు సూచించారు. మోట్ల మల్లికార్జునపురం చెంచు గిరిజనగూడెంలో బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. గూడెంలో వైద్యం

Published : 26 May 2022 06:47 IST


చికిత్స పొందుతున్న వ్యక్తితో మాట్లాడుతున్న 
పీవో రవీంద్రారెడ్డి

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న చెంచు గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి వైద్యులకు సూచించారు. మోట్ల మల్లికార్జునపురం చెంచు గిరిజనగూడెంలో బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. గూడెంలో వైద్యం పొందుతున్న వారితో పాటు పెద్దదోర్నాల సీీహెచ్‌సీీలో వైద్యచికిత్సలు తీసుకుంటున్న ఇద్దరిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. బాధితులకు వైద్యశాలలో నే సేవలందించాలని, మార్కాపురం వైద్యశాలకు సిఫార్సు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం 11 మంది కోలుకున్నారని, మరో ముగ్గురికి వైద్యచికిత్సలు అందిస్తున్నామన్నారు. గిరిజనుల ఆరోగ్యం కుదుటపడే వరకు డిప్యూటీ డీఎంహెచ్‌వో అందుబాటులో ఉంటారన్నారు. ఆయన వెంట ఎంపీీడీవో నాసర్‌రెడ్డి, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు, ఈవోఆర్డీ రంగయ్య తదితరులు ఉన్నారు.


పోక్సో కేసు నిందితుడికి అయిదేళ్ల జైలు

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి ఎం.ఎ.సోమశేఖర్‌ అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వి.రామేశ్వరరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీరాల మండలం కొత్తపాలేనికి చెందిన ఆసాది యశ్వంత్‌రెడ్ఢి.. చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలికను తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తించడంతో... ఆ చిన్నారి భయపడి కేకలు వేసింది. తల్లి అక్కడకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 2017 ఏప్రిల్‌ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు చీరాల ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడిపై ఛార్జిషీీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో నిందితుడికి అయిదేళ్ల జైలు, రూ.ఆరు వేల జరిమానా విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని