logo

దర్గా పునర్నిర్మాణ పనులు ప్రారంభం

పామూరు పట్టణంలోని సి.ఎస్‌.పురం రహదారిలో పురాతన మౌలా సాహెబ్‌ దర్గాను కొందరు అధికార పార్టీ నాయకులు ఈ నెల 23వ తేదీన జేసీబీతో కూల్చివేశారు. ఈ సంఘటనపై ముస్లిం సోదరులు రహదారిపై బైటాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Published : 28 May 2022 06:29 IST

పనులు చేస్తున్న కూలీలు

పామూరు, న్యూస్‌టుడే: పామూరు పట్టణంలోని సి.ఎస్‌.పురం రహదారిలో పురాతన మౌలా సాహెబ్‌ దర్గాను కొందరు అధికార పార్టీ నాయకులు ఈ నెల 23వ తేదీన జేసీబీతో కూల్చివేశారు. ఈ సంఘటనపై ముస్లిం సోదరులు రహదారిపై బైటాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ముస్లిం మత పెద్దలు సమావేశమై దర్గా పనులు ప్రారంభించేందుకు నిర్ణయించారు. కూల్చేసిన శిథిలాలను తొలగించి శుక్రవారం దర్గా పునః నిర్మాణ పనులను ముస్లిం పెద్దలు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని