logo

పెట్రోలు పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తండ్రి ఉద్యోగం తనకు రాకుండా చేశారని ఆవేదన చెందిన పట్టపురాజు శ్రీనివాసరావు అనే వ్యక్తి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. కార్యాలయం సిబ్బంది

Published : 28 May 2022 06:29 IST

పట్టపురాజు శ్రీనివాసరావు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: తండ్రి ఉద్యోగం తనకు రాకుండా చేశారని ఆవేదన చెందిన పట్టపురాజు శ్రీనివాసరావు అనే వ్యక్తి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. కార్యాలయం సిబ్బంది అప్రమత్తమై నిప్పంటుకోకుండా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం పట్టణానికి చెందిన పట్టపురాజు నాగయ్య మార్కాపురం ఆర్‌అండ్‌బీ డివిజన్‌ కార్యాలయంలో ప్రభుత్వ కాపలాదారుగా పనిచేస్తూ 2009 డిసెంబర్‌ 18వ తేదీన మృతిచెందారు. అనంతరం కుటుంబ సభ్యులు తనను సంప్రదించకుండా అధికారులకు లంచాలు ఇచ్చి ధ్రువపత్రం పొందారని, అందులో తన పేరు లేకపోవడంతో తండ్రి ఉద్యోగం తన తమ్ముడికి వచ్చిందని నాగయ్య పెద్ద కుమారుడు పట్టపురాజు శ్రీనివాసరావు ఆరోపించారు. ఆ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి న్యాయం చేయాలని కొన్ని సంవత్సరాలుగా తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కార్యాలయంలో ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతితో మాట్లాడుతూ ఆవేశానికి లోనై తన వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకున్నారు. అనంతరం లైటర్‌తో వెలిగించుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న ఎస్‌బీ కానిస్టేబుల్‌, కార్యాలయ సిబ్బంది వెంటనే అడ్డుకొన్నారు. పట్టణ పోలీసులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని అతడికి నచ్చజెప్పి జీపులో స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని