logo

జూన్‌ 30 నాటికి పూర్తి స్థాయిలో ఈ-కార్యాలయం

కలెక్టరేట్‌లో పూర్తి స్థాయిలో ‘ఈ-కార్యాలయం’ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 28 May 2022 06:29 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, చిత్రంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో పూర్తి స్థాయిలో ‘ఈ-కార్యాలయం’ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్‌ 30వ తేదీ నాటికి అన్ని దస్త్రాలను స్కాన్‌ చేసి ఈ-కార్యాలయంలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జిల్లాకు పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌ ఆదర్శంగా ఉండేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రజలు ఏ అవసరం కోసం 1077 నంబరుకు ఎప్పుడు ఫోన్‌ చేసినా స్పందించేలా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చదలవాడ పశుక్షేత్రం అభివృద్ధికి చర్యలు: నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: చదలవాడ పశు క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అన్నారు. పశుక్షేత్రంలోని వసతులు, షెడ్లు, మాగుడు గడ్డి నిల్వలను ఆయన శుక్రవారం పరిశీలించారు. పశుక్షేత్రం ఏర్పాటు లక్ష్యం, పశు పోషణ, పిండ ఉత్పత్తి కేంద్రం నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్‌కు పశుక్షేత్రం డిప్యూటీ డైరక్టర్‌ బి.రవి వివరించారు. మరింత సమర్థ నిర్వహణకు మరికొందరు కార్మికులు అవసరం ఉందని, అంతర్గత సిమెంట్‌ రోడ్ల నిర్మాణం చేపటాల్సి ఉందని విన్నవించారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పైపులైన్లకు నష్టపరిహారం ఇప్పించాలని పశుక్షేత్రం డీడీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భగా కలెక్టర్‌ గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడీ బేబీరాణీ, అమూల్‌ నోడల్‌ అధికారి కాలేషా, ఎంపీడీవో కుసుమ కుమారి, తహసీల్దార్‌ హరిబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని