logo

ప్రత్యేకతల సమాహారం.. మహానాడు

ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగు మహిళా నాయకురాలు ఆలపాటి దుర్గాభవాని బుల్లెట్‌ బండిపై వచ్చారు. గురువారం కూడా మంగళగిరి నుంచి చంద్రబాబు నిర్వహించిన ర్యాలీలో ఆమె వాహనంతో

Published : 28 May 2022 06:52 IST

బుల్లెట్‌పై మహానాడుకు వస్తున్న

మహిళా నాయకురాలు దుర్గాభవాని

అద్దంకి, న్యూస్‌టుడే: ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగు మహిళా నాయకురాలు ఆలపాటి దుర్గాభవాని బుల్లెట్‌ బండిపై వచ్చారు. గురువారం కూడా మంగళగిరి నుంచి చంద్రబాబు నిర్వహించిన ర్యాలీలో ఆమె వాహనంతో పాల్గొన్నారు. మహానాడు జరిగే ప్రదేశాలకు ఇలా బుల్లెట్‌పై ప్రయాణించడం అలవాటుగా చెప్పారు.

ఎన్టీఆర్‌తో డాక్టర్‌ ఆలూరి ప్రభాకరరావు (పాత చిత్రం)

ఒంగోలుకు చెందిన డాక్టర్‌ ఆలూరి ప్రభాకరరావుకు ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. జిల్లా పార్టీలో అడ్‌హాక్‌కమిటీ సభ్యులుగానూ పనిచేశారు. 1994 నాటి ఎన్నికల సమయంలో ఎంతో మంది అభ్యర్థులను ఒంగోలులోని డాక్టర్‌ ఆలూరి నివాసం నుంచే ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఎపుడు ఒంగోలు వచ్చినా తన నివాసంలో ఉండేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. 

దివంగత నందమూరితో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ అధ్యక్షులు త్రిమూర్తులు

ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన మన్నం త్రిమూర్తులు 2004 నుంచి అద్దంకి కేంద్రంగా ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఏర్పాటు చేసి, రాష్ట్రస్థాయిలో నాటికల పోటీలు నిర్వహించేవారు. ఎంతోమంది పేద కళాకారులకు ప్రోత్సాహం అందించేవారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో అద్దంకిలో ఎన్టీఆర్‌ పేరిట గ్రంథాలయం ఏర్పాటు చేసి అందులో ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన గ్రంథాలను ఉంచనున్నట్లు వెల్లడించారు. 1983 ఎన్నికల ప్రచారంలో ఒంగోలులో కలిసి వివరాలు అందించినట్లు త్రిమూర్తులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని