logo

సార్వత్రిక ‘పది’ ఫలితాల్లో వెనుకబాటు

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జరిగిన సార్వత్రిక (ఓపెన్‌ స్కూలు) పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. పదోతరగతిలో కేవలం 31.5 శాతం మాత్రమే ఉత్తీర్ణులవగా ఇంటర్‌లో 59 శాతం గట్టెక్కారు. సొసైటీ జిల్లా సమన్వయకర్త బి.శ్రీనివాసరెడ్డి వివరాలు తెలియజేశారు.

Published : 25 Jun 2022 03:15 IST

ఇంటర్‌లో 59 శాతం ఉత్తీర్ణత

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జరిగిన సార్వత్రిక (ఓపెన్‌ స్కూలు) పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. పదోతరగతిలో కేవలం 31.5 శాతం మాత్రమే ఉత్తీర్ణులవగా ఇంటర్‌లో 59 శాతం గట్టెక్కారు. సొసైటీ జిల్లా సమన్వయకర్త బి.శ్రీనివాసరెడ్డి వివరాలు తెలియజేశారు. పునఃపరిశీలన కోసం ఈనెల 27 నుంచి జులై 7 లోపు ఏదైనా ఆన్‌లైన్‌ కేంద్రం నుంచి దరఖాస్తు చేయాలన్నారు. అనుత్తీర్ణులైనవారికి ఆగస్టు 3 నుంచి 11 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ఇంటర్‌ వారికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని