logo

విధి నిర్వహణకు వెళుతూ..

ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన మద్దిపాడు మండలం సీతారాంపురం కొష్టాలుసెంటర్‌ వద్ద జాతీయ రహదారి పై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...

Published : 25 Jun 2022 03:15 IST


పావని (పాత చిత్రం)

మద్దిపాడు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన మద్దిపాడు మండలం సీతారాంపురం కొష్టాలుసెంటర్‌ వద్ద జాతీయ రహదారి పై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...ఒంగోలు కమ్మపాలెనికి చెందిన నీల పావని (25), ఒంగోలు మండలం పెళ్లూరుకు చెందిన వెన్నెల స్థానికంగా ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. మేదరమెట్లలో నూతనంగా బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాంపురం వద్ద కంటైనర్‌ లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ లారీ కింద పడ్డారు. పావని అక్కడికక్కడే మృతి చెందింది. వెన్నెల కాళ్లపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ● పావని తల్లిదండ్రులు ఒంగోలులోని కమ్మపాలెంలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చివరి అమ్మాయి పావని విద్యాభ్యాసం అనంతరం ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. విధి నిర్వహణకు వెళుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది.

ఉరి వేసుకొని గృహిణి ఆత్మహత్య

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు మండలం మోడంపల్లె గ్రామంలో శుక్రవారం ఓ గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మోడంపల్లె గ్రామానికి చెందిన కప్పల రాంబాబుకు తిమ్మాపురం గ్రామానికి చెందిన మేకల తిరుపాలు కుమార్తె భవాని(28)ని ఇచ్చి 8 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త రాంబాబు తల్లిదండ్రులతో కలసి హైదరాబాదులో నివాసముంటున్నారు. భవాని మోడంపల్లె గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త తనను హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని కోరినప్పటికీ తీసుకెళ్లపోవడంతో మస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భవాని తండ్రి మేకల తిరుపాలు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని