logo

2,09,776 మందికి అమ్మఒడి లబ్ధి

జగనన్న అమ్మఒడి పథకం మూడో విడత కింద జిల్లా వ్యాప్తంగా 2,09,776 మంది రూ.314.66 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. జిల్లాలోని 38 మండలాల పరిధిలో ఉన్న 3,087 పాఠశాలలు, కళాశాలకు చెందిన

Published : 27 Jun 2022 02:17 IST

జగనన్న అమ్మఒడి పథకం మూడో విడత కింద జిల్లా వ్యాప్తంగా 2,09,776 మంది రూ.314.66 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. జిల్లాలోని 38 మండలాల పరిధిలో ఉన్న 3,087 పాఠశాలలు, కళాశాలకు చెందిన 3,47,510 మంది విద్యార్థుల వివరాలు ఎన్‌రోల్‌ చేయగా, అందులో 2.09 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. మార్గదర్శకాల ప్రకారం ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే వారిలో ఒకరికి మాత్రమే పథకం వర్తించనుంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకాకుళంలో సోమవారం పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాలో నిధులు జమ కానున్నాయి. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ఈ ఏడాది రూ.2 వేలు తగ్గించి, మిగతా రూ.13 వేల నగదు జమ చేస్తారు. జిల్లా స్థాయిలో ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని