logo

కలెక్టర్‌ చెప్పినా.. పొలంలోకి రానివ్వలేదు

కనిగిరి పట్టణంలో పవిత్ర కల్యాణ మండపంలో ఈ నెల 24 న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రత్యేక స్పందన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నుంచి అర్జీల స్వీకరించి

Updated : 27 Jun 2022 05:51 IST

పట్టాదారు పాసుపుస్తకంతో స్పందనకు వచ్చిన మాల్యాద్రి

కనిగిరి, న్యూస్‌టుడే : కనిగిరి పట్టణంలో పవిత్ర కల్యాణ మండపంలో ఈ నెల 24 న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రత్యేక స్పందన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నుంచి అర్జీల స్వీకరించి వీలున్నంతగా ఆరు మండలాల్లోని సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. కాని సమస్యలకు ఎక్కడ పరిష్కారం కావడం లేదు. అందుకు ఉదాహరణ కనిగిరి మండలంలోని పునుగోడుకు చెందిన మేకల మాల్యాద్రికి మండలంలోని కొత్తపాలెంలో తన తండ్రి నుంచి సక్రమించిన 4 ఎకరాల పొలం ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు పొలం సాగు చేసుకోనివ్వకుండా భయబ్రాంతులకు గురి చేస్తుండటంతో స్పందన కార్యక్రమంలో కలెక్టరు దినేష్‌కుమార్‌ తెలిపారు. దీంతో కలెక్టర్‌ తహసీల్దార్‌ పుల్లారావును పిలిపించి పొలం గురించి వివరాలు అడగ్గా 4 ఎకరాల పొలం మాల్యాద్రిదేనని పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయని తెలిపారు. దీంతో కలెక్టరు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు పొలం నీదే సాగు చేసుకోమని తెలిపారు. దీంతో పొలం సాగు చేసుకునేందుకు ఆదివారం పొలంలోకి వెళ్లగా అవతలి వర్గం వారు పొలంలోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో వెనక్కి తిరిగి వచ్చాడు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేసి నా పొలం నాకు ఇప్పించాలని మాల్యాద్రి వేడుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని