logo

‘హామీలన్నింటినీ నెరవేరుస్తాం’

వైకాపాకు మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన్‌, భగవత్‌ గీతా లాంటిదని సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం వై.పాలెం

Published : 27 Jun 2022 02:17 IST

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున (చిత్రంలో మంత్రి సురేష్‌,

ఎంపీ మాగుంట, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు బుర్రామధుసూదనయాదవ్‌,

అన్నారాంబాబు, నాగార్జునరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ తదితరులు)

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే : వైకాపాకు మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన్‌, భగవత్‌ గీతా లాంటిదని సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం వై.పాలెం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ సీఎం సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని పేర్కొన్నారు. మంత్రి సురేష్‌ మాట్లాడుతూ పదవుల్లో మాజీ మంత్రి బాలినేని, పిన్నాళ్ల వంటి నాయకులు వెనక్కు తగ్గి బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు నిధులు అధికంగా ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టించిన ఘనత సీఎందే నన్నారు. చంద్రబాబునాయుడు ఏ కులానికి, ఏ మతానికి గానీ ఏమి చేయలేదని విమర్శించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ మాట్లాడుతూ పార్టీలో విభేదాలుంటే సర్దుకొని పోవాలని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రామధుసూదనయాదవ్‌, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు అన్నారాంబాబు, నాగార్జునరెడ్డిలు మాట్లాడారు. ముందుగా వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రామధుసూదనయాదవ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు, టీ5 కాలువ, పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ నేషనల్‌ హైవే రహదారి, పుల్లలచెరువు మండలం చేపలమడుగులో విద్యుత్తు సబ్‌స్టేషన్‌లు పూర్తి చేసేందుకు తీర్మానాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని