logo

ఆశల దీపానికి ఊపిరి పోయరూ!

అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన బోసి నవ్వుల చిన్నారి... గుండె సంబంధ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. శస్త్ర చికిత్సతో కోలుకునే అవకాశం ఉన్నా... అంత స్థోమత లేకపోవడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బాబు ప్రాణం నిలిపే దాతల సాయం కోసం అర్ధిస్తున్నారు.

Published : 28 Jun 2022 03:22 IST

ప్రాణాపాయంలో ఏడు నెలల చిన్నారి

దాతల సాయానికి తల్లిదండ్రుల వేడుకోలు

అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన బోసి నవ్వుల చిన్నారి... గుండె సంబంధ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. శస్త్ర చికిత్సతో కోలుకునే అవకాశం ఉన్నా... అంత స్థోమత లేకపోవడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బాబు ప్రాణం నిలిపే దాతల సాయం కోసం అర్ధిస్తున్నారు.

కొండపి పంచాయతీ కట్టావారిపాలెనికి చెందిన తన్నీరు శివ దంపతులు... హైదరాబాద్‌లో బేల్దారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. పేరు మహేష్‌. నెలన్నర క్రితం బాబు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో సమీపంలోని వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు పెద్దాసుపత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌ (గుండెకు రంధ్రం, పుట్టకతో వచ్చిన ఇతర సమస్యలు)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్సతో సమస్యను సరి చేయవచ్చని... ఇందుకు రూ.4 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం కావడంతో... అంత మొత్తం వెచ్చించలేని తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. మనసున్న దాతలు చేయూతనందించి తమ బిడ్డ ప్రాణాలు నిలపాలని వేడుకుంటున్నారు. విషయం తెలిసి... గ్రామానికి చెందిన మనవూరి వికాసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సుమారు రూ.లక్ష సమకూర్చారు. - న్యూస్‌టుడే, కొండపి

దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 80080 00235

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని