logo
Published : 28 Jun 2022 03:22 IST

నూతన పోలీసు సర్కిళ్లకు పచ్చజెండా

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా నూతనంగా ప్రతిపాదించిన కనిగిరి పోలీసు సబ్‌ డివిజన్‌తో పాటు... కొండపి, త్రిపురాంతకం, కంభం సర్కిల్‌ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒంగోలు మూడో పట్టణ, చీమకుర్తి, మార్కాపురం స్టేషన్ల స్థాయి పెంచాలన్న ప్రతిపాదనకు మాత్రం సానుకూల స్పందన రాలేదు. నూతన సబ్‌ డివిజన్‌, సర్కిళ్లకు అదనంగా పోస్టులు కేటాయించలేదు. జిల్లా కేంద్రంలోని డీటీసీలో ఉన్న డీఎస్పీ స్థానంతో పాటు... సీసీఎస్‌, జిల్లా కేంద్రంలోని సీఐ పోస్టులను నూతన సర్కిళ్లకు కేటాయిస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో కొత్త సర్కిళ్లకు సీఐలను నియమించే అవకాశం ఉంది.

సొంత జిల్లాల కోసం పైరవీలు...!

గత మూడు రోజులుగా సీఐల బదిలీల కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలోనే రేంజి పరిధిలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సర్కిళ్లకు అధికారుల సర్దుబాటు నేపథ్యంలో... అనుకూలమైన స్థానాల కోసం కొందరు సీఐలు రాజకీయ నాయకులతో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఎస్సైలు, సీఐలు సొంత జిల్లాల్లో పనిచేసేందుకు వీల్లేదు. జిల్లాల పునర్విభజనలో కొందరు అనూహ్యంగా తమ సొంత జిల్లాల్లో పనిచేయాల్సి వచ్చింది. తాజా బదిలీల్లోనూ అదే జిల్లాలో కొనసాగేలా పలువురు పైరవీలు చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విభజన స్వరూపం ఇలా...

ఒంగోలు సబ్‌ డివిజన్‌:

ఒంగోలు నగరంలోని సర్కిళ్లు: ఒంగోలు ఒకటి, రెండో పట్టణ (ఈ పరిధిలోనే కొత్తపట్నం స్టేషన్‌), ఒంగోలు తాలూకా స్టేషన్‌. (వీటికి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లే... స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు)

ఒంగోలు గ్రామీణ సర్కిల్‌: చీమకుర్తి, మద్దిపాడు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు

సింగరాయకొండ సర్కిల్‌: సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి

సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌), ట్రాఫిక్‌, దిశ స్టేషన్లు (వీటికీ డీఎస్పీలు ఎస్‌హెచ్‌ఓలుగా వ్యవహరిస్తారు. ఇవి ఒంగోలు సబ్‌ డివిజన్‌ పరిధిలోకి రావు)

దర్శి సబ్‌ డివిజన్‌:

దర్శి సర్కిల్‌: దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు

పొదిలి సర్కిల్‌: పొదిలి, కొనకనమిట్ల, తాడివారిపల్లి

త్రిపురాంతకం సర్కిల్‌: త్రిపురాంతకం, దొనకొండ, కురిచేడు

మర్కాపురం సబ్‌ డివిజన్‌:

మార్కాపురం సర్కిల్‌: మార్కాపురం పట్టణ, గ్రామీణ స్టేషన్లు

కంభం సర్కిల్‌: కంభం, బేస్తవారపేట, అర్థవీడు

యర్రగొండపాలెం: యర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు

గిద్దలూరు సర్కిల్‌: గిద్దలూరు, కొమరోలు, రాచర్ల

కనిగిరి సబ్‌ డివిజన్‌:

కనిగిరి సర్కిల్‌: కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి

పామూరు సర్కిల్‌: పామూరు, సీఎస్‌పురం, వెలిగండ్ల

కొండపి సర్కిల్‌: కొండపి, పొన్నలూరు, మర్రిపూడి

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని