logo

‘అమ్మ ఒడి’ పథకానికి రూ.314.66 కోట్లు

జగనన్న అమ్మఒడి పథకం కింద జిల్లాలోని 2,09,776 మంది లబ్ధిదారుల(తల్లులు)కు రూ.314.66 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో సోమవారం జిల్లా స్థాయిలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు.

Published : 28 Jun 2022 03:22 IST


విద్యార్థులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌.. చిత్రంలో

ఒంగోలు మేయర్‌ సుజాత, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న అమ్మఒడి పథకం కింద జిల్లాలోని 2,09,776 మంది లబ్ధిదారుల(తల్లులు)కు రూ.314.66 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో సోమవారం జిల్లా స్థాయిలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. 38 మండలాల పరిధిలోని 3,087 విద్యా సంస్థల్లో చదువుతున్న 3,47,510 మంది విద్యార్థుల తల్లులను లబ్ధిదారులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిధులను పిల్లల విద్యావసరాలకు సమర్ధంగా వినియోగించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయకుండా ఆడపిల్లలను కనీసం ఇంటర్‌ అయినా చదివించాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ‘మనబడి, నాడు-నేడు’ పేరుతో చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఆర్థికసాయంతోపాటు, పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు ఇవ్వడం ద్వారా నాణ్యమైన విద్య బోధించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య, నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, ఆర్‌జేడీ సుబ్బారావు, ఆర్‌ఐవో సైమన్‌ విక్టర్‌, డీఈవో విజయభాస్కర్‌, సమగ్రశిక్ష అభియాన్‌ ఏపీసీ శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈవో అనితా రోజ్‌రాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అర్హులైన విద్యార్థులకు చెక్కులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని