logo

లారీని ఢీకొని కారు చోదకుడి మృతి

ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... వ్యవసాయాధికారిణి (ఏవో) దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన ఎస్‌కె.వహీదాబాను చాగలమర్రి మండల వ్యవసాయాధికారిణిగా విధులు నిర్వహిస్తున్నారు. తన భర్త

Published : 28 Jun 2022 03:22 IST


మహబూబ్‌ బాషా (పాత చిత్రం)

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... వ్యవసాయాధికారిణి (ఏవో) దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన ఎస్‌కె.వహీదాబాను చాగలమర్రి మండల వ్యవసాయాధికారిణిగా విధులు నిర్వహిస్తున్నారు. తన భర్త మహమ్మద్‌ ఘనీ జమాల్‌తో కలిసి అమరావతిలోని సచివాలయానికి కారులో ఆదివారం రాత్రి బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున త్రిపురాంతకం మండలం దూపాడులోని సాగర్‌ కాలువ వంతెన వద్ధ.. ముందు వెళ్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చోదకుడు మహబూబ్‌ బాషా (54) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మహమ్మద్‌ ఘనీ జమాల్‌కు తీవ్ర గాయాలు కాగా... వహీదాబాను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను వినుకొండ తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చోదకుడు మహబూబ్‌ బాషాకు ఆరుగురు సంతానం. వీరిలో ఇద్దరికి ఇటీవలే వివాహం చేశారు. మిగతా నలుగురిని తన రెక్కల కష్టంతో చదివిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని