logo

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై మరింత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. సంబంధిత అధికారులతో ప్రకాశం భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి విద్యుత్తు సౌకర్యం, బ్యాంకు ఖాతా, 500కు పైగా జనాభా ఉన్న గ్రామాలకు రోడ్డు మార్గం, అడవుల పెంపకం తదితర అంశాలపై చర్చించారు. ప్రభు

Published : 28 Jun 2022 03:22 IST


అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై మరింత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. సంబంధిత అధికారులతో ప్రకాశం భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి విద్యుత్తు సౌకర్యం, బ్యాంకు ఖాతా, 500కు పైగా జనాభా ఉన్న గ్రామాలకు రోడ్డు మార్గం, అడవుల పెంపకం తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని... ఆయా లక్ష్యాల సాధనలో పురోగతి, సమగ్ర వివరాలను తనకు సమర్పించాలని ఆదేశించారు. డ్వామా పీడీ శీనారెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ కొండయ్య, సీపీవో వెంకటేశ్వర్లు, ఎల్‌డీఎం యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని