logo
Published : 28 Jun 2022 03:22 IST

పరిష్కరిస్తారనే ఆశతో

-ఈనాడు, ఒంగోలు

సోమవారం కలెక్టరేట్‌ వద్ద క్యూ కట్టిన అర్జీదారులు

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకు వస్తున్న అర్జీదారుల సంఖ్య పెరుగుతోంది. అధికారుల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు.

చిత్రంలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు గురవయ్య. పర్చూరు ఇందిరాకాలనీ. ఆరునెలల క్రితం ఆటో ఢీకొట్టడంతో కుడికాలు పాదం వేళ్లు మొత్తం తెగిపోయాయి. దీంతో ఏ పనికీ వెళ్లలేని పరిస్థితి. భార్య కూలి పనులకు వెళ్లి కుటుంబానికి అండగా ఉంటున్నారు. మే మొదటి వారంలో దివ్యాంగ పింఛను కోసం గురవయ్య ఇక్కడకు వచ్చి అర్జీ ఇచ్చారు. సదరం ధ్రువపత్రం అవసరమని చెప్పడంతో దానిని తీసుకొని వచ్చారు. తీరా ఇక్కడ కాదని, బాపట్ల జిల్లా కేంద్రానికి వెళ్లాలని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని