logo
Published : 28 Jun 2022 03:22 IST

తొలకరి వర్షం... పశువులు భద్రం

- న్యూస్‌టుడే, టంగుటూరు

తొలకరి ప్రారంభమైన నేపథ్యంలో పాడి, ఇతర పశువుల్లో కాలానుగుణ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నందున పోషకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టంగుటూరు పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ సుధీర్‌బాబు సూచించారు. ఈ సీజన్‌లో ప్రధానంగా గొంతువాపు లేదా దిగిపెట్టు వ్యాధి (హెమరాజిక్‌ సెప్టిసీమియా) వచ్చే అవకాశం ఉందన్నారు.

కారణం: వర్షాలకు కొత్తగా మొలకెత్తిన పచ్చికలో నీరు నీరు నిలిచి... బురదలోని బ్యాక్టీరియా పచ్చికలో చేరుతుంది. ఇది తింటే పశువుల్లో సమస్య తలెత్తుతుంది. ఒక దాని నుంచి మిగతా వాటికి గాలి, నీరు, మేత ద్వారా వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలు: గొంతు కింద వాపు, తీవ్రమైన జ్వరం, నోటి వెంట సొంగ పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస పీల్చేందుకు ఇబ్బంది పడతాయి. నిర్లక్ష్యం వహిస్తే పశువు మృతి చెందే అవకాశం ఉంటుంది.

చికిత్స: సల్ఫాడిమిడిన్‌, సల్ఫాట్రైమిప్రిన్‌, ఎన్‌రోఫ్లాక్సాసిన్‌, సిఫ్రాఫ్లాక్సాసిన్‌ వంటి యాంటీబయాటిక్‌ మందులు వినియోగించవచ్ఛు వీటితో పాటు యాంటీ హిస్టమిన్స్‌, ఎవిల్‌, జీట్‌ వంటి మందులు... అనుబంధంగా బెలామిన్‌ వంటి సిరంజిలు ఉపయోగించవచ్ఛు

ముందస్తుగా హెచ్‌ఎస్‌ వ్యాక్సిన్‌ ఇస్తే పశువుల్లో ఈ సమస్య తలెత్తదు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఇది అందుబాటులో ఉంటుంది. నాలుగు నెలల దూడ మొదలు అన్ని రకాల పశువులకు దీనిని వినియోగించవచ్ఛు

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని