logo

ప్రధాని సభకు 60 వేల మంది!

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జులై 4న ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం రానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఏఎస్‌ఆర్‌

Published : 28 Jun 2022 06:44 IST

పెద అమిరంలో వేగంగా ఏర్పాట్లు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జులై 4న ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం రానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఏఎస్‌ఆర్‌ పార్కులో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని కాళ్ల మండలం పెదఅమిరంలో బహిరంగ సభలో జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. సభా ప్రాంగణంలో 60 వేల మంది కూర్చొనేందుకు అనువుగా వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు వేస్తున్నారు. భారీ వర్షం కురిసినా ఇబ్బంది తలెత్తకుండా జర్మన్‌ సాంకేతికతతో ఈ పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలుపుదల చేసే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ముందుగానే భీమవరం చేరుకోనుండటంతో అతిథిగృహాలను ఇక్కడి నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.

నేడు ప్రత్యేక బృందాల పరిశీలన..

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్‌పీజీ, ప్రత్యేక బృందాలు మంగళవారం భీమవరం రానున్నాయి. బహిరంగ సభా ప్రాంగణంతోపాటు ప్రధాని సందర్శించే ప్రాంతాల్లో ఏర్పాట్లను, అక్కడికి చేరుకునే మార్గాలను వారు పరిశీలిస్తారు. వీరితో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖకు చెందిన ముఖ్యులు భీమవరంలో పర్యటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని