logo

రాజధానిపై స్పష్టమైన అభిప్రాయం ప్రకటించాలి : భాజపా

రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజధాని భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు

Published : 28 Jun 2022 06:32 IST


సమావేశంలో మాట్లాడుతున్న వీర్రాజు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజధాని భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే పాలన చేయడం సరైంది కాదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రూ.10 వేల కోట్ల వ్యయంతో మూడు సంవత్సరాల్లో రాజధానిని నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా విద్యా వ్యవస్థలో మార్పు రావడం లేదని విమర్శించారు. కేంద్ర సహకారంతో గత ప్రభుత్వ హయాంలో కట్టిన 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ, నరిశే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని