logo

రానున్న నాలుగు నెలలు కీలకం

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతంతో పాటు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి

Published : 29 Jun 2022 02:38 IST

వీక్షణ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌.. చిత్రంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతంతో పాటు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై అన్ని మండలాల అధికారులతో ఆయన మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రానున్న నాలుగు నెలలు అత్యంత కీలకమని, ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు ఇళ్ల కోసం తీసుకునే అదనపు డబ్బులను నిర్మాణ పనులకే ఖర్చు చేసేలా చూడాలన్నారు. దర్శి నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణ పనులు పేలవంగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ శాఖ డీఈకి సంజాయిషీ నోటీసు జారీ చేయాలని పీడీని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రతి మండలానికి మరో మూడు గ్రామాలను ఎంపిక చేసి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదే విషయమై వచ్చే నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు, స్పందన అర్జీల పరిష్కారం, జగనన్న పాల వెల్లువపై సమీక్షించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డీపీవో నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని