logo
Published : 29 Jun 2022 02:38 IST

నీటి కోసం కార్యాలయం ముట్టడి

ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి,

తెదేపా నాయకులు, మహిళలు

పొదిలి, న్యూస్‌టుడే: ‘తాగేందుకు గుక్కెడు నీటినీ అందించలేకపోతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు...’ అంటూ కాటూరివారిపాలెం ఎస్టీ, బీసీ కాలనీతో పాటు పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాల వాసులు నగర పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ఉదయం 10 గంటలకే కార్యాలయం వద్దకు చేరుకుని ఖాళీ బిందెలతో బైఠాయించారు. విషయం తెలుసుకున్న తెదేపా మార్కాపురం నియోజకవర్గ బాధ్యుడు కందుల నారాయణరెడ్డి, నాయకులు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నగర పంచాయతీలో అధికారులు, కాంట్రాక్టర్లు నీళ్ల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. రోజుకు 202 ట్రిప్పులు తోలుతున్నట్లు కాగితాల్లో చూపుతున్నా.. వాస్తవానికి అందులో సగం కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు. గత మూడేళ్లలో రూ. పది కోట్లకు పైగా సొమ్ము దుర్వినియోగమైందని.. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కాటూరివారిపాలేనికి 15 రోజులుగా నీళ్లు సరఫరా కాకుంటే అధికారులు ఏం చేస్తున్నారని మాజీ సర్పంచి కాటూరి నారాయణ ప్రతాప్‌ ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన నగర పంచాయతీ కమిషనర్‌ దానియేల్‌ జోసఫ్‌ను మహిళలు చుట్టుముట్టారు. గుత్తేదారుతో సంబంధం లేకుండా తామే నీటిని సరఫరా చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని