logo

స్వచ్ఛ విద్యాలయాలు 38

స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఎనిమిది చోటు సంపాదించగా.. 30 పాఠశాలలు సబ్‌ కేటగిరీలో ఎంపికయ్యాయి. కొవిడ్‌

Published : 29 Jun 2022 02:38 IST

1న జిల్లా స్థాయి అవార్డుల ప్రదానం

యర్రగొండపాలెం మండలం మురారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఎనిమిది చోటు సంపాదించగా.. 30 పాఠశాలలు సబ్‌ కేటగిరీలో ఎంపికయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడిచిన మూడేళ్లలో జిల్లా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోయాయి. ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 4305 పాఠశాలల వివరాలను స్వచ్ఛ విద్యాలయం యాప్‌లో నమోదు చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, నీటి ప్రవాహం, పచ్చదనం, కొవిడ్‌ జాగ్రత్తల అమలు వంటి ఆరు అంశాల్లో బాగున్న వాటిని ఓవరాల్‌ అవార్డు కింద ఎంపిక చేశారు. వీటిని రాష్ట్రస్థాయి పోటీలకూ పంపుతారు. ఆరింటిలో ఒక్కో కేటగిరీ కింద 5 పాఠశాలలు ఎంపిక చేశారు. సబ్‌ కేటగిరీ కింద మొత్తం 30 పాఠశాలలు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యాయి. అవార్డులన్నీ ప్రభుత్వ పాఠశాలలకే దక్కడం విశేషం. జులై 1న సాయంత్రం 3 గంటలకు స్పందన భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఓవరాల్‌ అవార్డ్‌ కేటగిరీలో ఎంపికైతే సమగ్రశిక్ష సంస్థ ద్వారా అదనంగా రూ.60 వేలు స్కూల్‌ గ్రాంట్‌లో కలిపి ఇస్తారు. సబ్‌ కేటగిరీలో వాటికి రూ.20 వేలు అందజేస్తారు.

ఓవరాల్‌ అవార్డుకు ఎంపికైనవి..: మురారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల(యర్రగొండపాలెం), గుండాయిపాలెం, బాలాజీ నగర్‌(ఒంగోలు), పేరంగుడిపల్లి(కనిగిరి),

ఉన్నత పాఠశాలలు: చవిటిపాలెం(సంతమాగులూరు), ముండ్లపాడు(గిద్దలూరు), యర్రగొండపాలెం(యర్రగొండపాలెం), బండ్లమిట్ట(ఒంగోలు)

సబ్‌ కేటగిరీ కింద ఎంపికైనవి...: ప్రకాశం బాలికల పాఠశాల, ఎంపీయూపీఎస్‌, తిమ్మాయిపాలెం(అద్దంకి), కాకర్ల(అర్థవీడు), యర్రగుడిపాడు(చీమకుర్తి), తురిమెళ్ల(కంభం), శేషంవారిపల్లి, దర్శి, దర్శి పశ్చిమ ఉన్నత, ప్రాథమిక(దర్శి), గిద్దలూరు ఉన్నత, గిద్దలూరు ఆరో వార్డులోని ప్రాథమిక, పొట్లూరు ప్రాథమికోన్నత పాఠశాల(గిద్దలూరు), కోటతిప్పలపలి ్ల(హనుమంతునిపాడు), మహదేవపురం(కందుకూరు), కేజీబీవీ(కందుకూరు)ఉన్నాయి. అలాగే ఇడమకల్లు ప్రాథమికోన్నత(కొమరోలు), మూగచింతల(కొండపి), దైవాలరావూరు(కొరిశపాడు), ఒకటో వార్డు ప్రాథమిక పాఠశాల, పీఎస్‌ కాలనీ జడ్పీ బాలికల పాఠశాల(మార్కాపురం), బొబ్బేపల్లి, జొన్నతాళి(మార్టూరు), పెదవారిమద్ది(పీసీపల్లి), ఓబులక్కపల్లి(పెద్దారవీడు), యానాదికాలనీ(పొదిలి), వెలకగపూరి(టంగుటూరు), అంకభూపాలపల్లి(వలేటివారిపాలెం), పండువ నాగులవరం(వెలిగండ్ల), పందిళ్లపల్లి(వేటపాలెం) ఎంపికయ్యాయి.

ఒంగోలు బాలాజీనగర్‌ ప్రాథమికోన్నత పాఠశాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని