logo

అత్యాచారం కేసులో జీవిత కాలం శిక్ష

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత కాలం జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, పోక్సో కోర్ట్‌ ఇన్‌ఛార్జి జడ్జి ఎం.ఎ.సోమశేఖర్‌

Published : 29 Jun 2022 02:38 IST

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత కాలం జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, పోక్సో కోర్ట్‌ ఇన్‌ఛార్జి జడ్జి ఎం.ఎ.సోమశేఖర్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వి.రామేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం సుందరయ్య కాలనీకి చెందిన ఆరెం చెన్నయ్య అనే వ్యక్తి పదమూడేళ్ల బాలికపై 2018 ఫిబ్రవరి 3న అత్యాచారానికి పాల్పడ్డాడు. గేదె పేడ తీసుకు రావడానికి కాలనీ చివరికి బాలిక వెళ్లిన సమయంలో ఆమెను బెదిరించి బలవంతంగా సమీపంలోని ఇంటిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావటంతో పోక్సో చట్టం సెక్షన్‌ 4(2) ప్రకారం చెన్నయ్య జీవిత కాలం జైలులో ఉండాలని జడ్జి తీర్పు చెప్పారు. రూ. 2 వేలు జరిమానా విధించారు. బెదిరింపులకు గురిచేసినందుకు గాను 20 ఏళ్లు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా, ఒక నెల జైలు, రూ. వెయ్యి జరిమానా విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని