logo

పట్టపగలే దుకాణంలో చోరీ

పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో మంగళవారం మధ్యాహ్నం ఓ దుకాణంలో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముపాలేనికి

Published : 29 Jun 2022 02:38 IST

ప్రజలు, పోలీసులు కలిసి దొంగలను పట్టుకున్న వైనం

పీసీపల్లి, పొన్నలూరు, న్యూస్‌టుడే: పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో మంగళవారం మధ్యాహ్నం ఓ దుకాణంలో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముపాలేనికి చెందిన భూమిరెడ్డి జయలక్ష్మి కె.అగ్రహరంలో ట్రాక్టర్‌ విడి పరికరాల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చారు. ఇద్దరు దుకాణం లోపలికి వచ్చి ట్యూబ్‌ కావాలని రూ.500 నోటు జయలక్ష్మీకి ఇచ్చారు. ఆమె చిల్లర ఇచ్చేందుకు గల్లా పెట్టె తెరవగా, అందులో నగదు కట్టలు కనిపించడంతో వెంటనే యజమానిని పక్కకు తోసేసి నగదు తీసుకొని ద్విచక్రవాహనాలపై పారిపోయారు. మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి వెంటనే పొన్నలూరు, పీసీపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సైతం పెదఅలవలపాడు, పీసీపల్లి, వరిమడుగు, వెంగళాయపల్లి ప్రజలను అప్రమత్తం చేశారు. దొంగలు పీసీపల్లిలోని పెదఇర్లపాడు వైపు వైళుతుండగా పెట్రోలు బంకు వద్ద పోలీసులు, గ్రామస్థులు అటకాయించి ఒకరిని పట్టుకోగా, మరొకతను పరారయ్యాడు. అతడిని రావికుంటపల్లి టోల్‌ప్లాజా సమీపంలో కనిగిరి పోలీసులు పట్టుకున్నారు. చొక్కాలు మార్చుకొని తిరుగుతున్న మరో ఇద్దరు దొంగలను వెంగళాయపల్లిలో గ్రామస్థులు పట్టుకున్నారు. వారందరినీ పీసీపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో సహకరించిన వెంగళాయపల్లి సర్పంచి కరణం తిరుపతయ్య, గ్రామ యువకులను పోలీసులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు