logo

పార్టీ సేవకు.. మూడో తరం

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు వీరాభిమాని, పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్న స్థానిక అర్బన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌పీరా బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను బుధవారం కలిశారు.

Published : 30 Jun 2022 02:13 IST

లోకేష్‌తో హుస్సేన్‌పీరా కుటుంబ సభ్యులు

కంభం, న్యూస్‌టుడే : తెదేపా వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు వీరాభిమాని, పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్న స్థానిక అర్బన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌పీరా బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను బుధవారం కలిశారు. హుస్సేన్‌పీరా మూడో తరం వారైన మనువళ్లు సయ్యద్‌ హసన్‌ మొహినుద్దీన్‌ ఖాద్రి, తాజ్‌ అజ్మద్దిన్‌లకు కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పీరా తయారు చేసిన పార్టీ చిహ్నాలను లోకేష్‌కు అందజేశారు. వాటిని ఆయన ఆసక్తిగా పరిశీలించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న హుస్సేన్‌పీరాను అభినందించారు. పార్టీకి చేస్తున్న సేవను కొనియాడారు. గతేడాది చంద్రబాబునాయుడును కలిసినప్పుడు రూ.2 లక్షల చెక్కు అందజేశారు. పార్టీ సమావేశాలు జరిగిన ప్రతిసారి నాయకులు, కార్యకర్తలకు పార్టీ చిహ్నాలు పంచుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు నూరుల్లాఖాద్రి పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మూడో తరం వారు పార్టీకి సేవ చేసేందుకు ముందుకు వచ్చారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని