logo

అనుమతిలేకుండా నిల్వచేసిన సిలిండర్లు స్వాధీనం

చీమకుర్తి కొత్తపేట బజారులో అనుమతి లేకుండా వివిధ గ్యాస్‌ కంపెనీలకు చెందిన సిలిండర్లు నిల్వ చేసిన ఇంటిపై స్పెషల్‌ బ్రాంచి పోలీసులు బుధవారం దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 30 Jun 2022 02:13 IST

సిలిండర్లను పరిశీలిస్తున్న స్పెషల్‌ బ్రాంచి ఆధికారి సురేష్‌

చీమకుర్తి, న్యూస్‌టుడే : చీమకుర్తి కొత్తపేట బజారులో అనుమతి లేకుండా వివిధ గ్యాస్‌ కంపెనీలకు చెందిన సిలిండర్లు నిల్వ చేసిన ఇంటిపై స్పెషల్‌ బ్రాంచి పోలీసులు బుధవారం దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక విభాగం అధికారి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు... కొత్తపేట బజారులో తాళ్లూరి రామకృష్ణ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్‌పీ, ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్లను రీ ఫిల్లింగ్‌ చేసి గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమలు, హోటళ్లకు అమ్మకాలు చేస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమయంలో ఓ కంపెనీకి చెందిన సిలిండర్లను సంబంధిత సిబ్బందితో గృహంలో దింపుతుండగా పట్టుకున్నారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రెండు కంపెనీలకు చెందిన నిండు సిలిండర్లు 29,  చిన్న ఖాళీ సిలిండర్లు 10,  పెద్ద ఖాళీ సిలిండర్లు 5లను (మొత్తం 44 సిలిండర్లు) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తున్న రామకృష్ణ, హెచ్‌పీ గ్యాస్‌ ఆటో నడుపుతున్న వెంగళ మణికంఠను అదుపులోకి  తీసుకొని పోలీసు స్టేషన్‌లో అప్పగించినట్లు సురేష్‌ చెప్పారు. నివాస గృహాల మధ్య ఈ రీతిలో పెద్ద ఎత్తున సిలిండర్లను నిల్వ చేసి రీఫిల్లింగ్‌ చేస్తున్న వ్యవహారం బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చీమకుర్తి పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇదే రీతిలో కొందరు వ్యక్తులు అక్రమంగా గ్యాస్‌ సిలిండర్లు నిల్వ చేస్తూ అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయా విభాగాల అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని