logo
Published : 30 Jun 2022 02:13 IST

ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట: కలెక్టర్‌

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, చిత్రంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపును సమర్ధంగా అడ్డుకోవాలని సెబ్‌ అధికారులను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా, గుర్తింపు పొందిన వాగులు, వంకల నుంచి ఇసుక తరలింపుపై బుధవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు వినియోగించుకోని ఇసుక రీచ్‌ల గుర్తింపును రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జగనన్న కాలనీలు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో రీచ్‌ల స్థితిగతులపై గనులశాఖ డీడీ రవికుమార్‌ వివరించారు. ఇసుక తవ్వకాల కోసం గుర్తింపు పొందిన రీచ్‌లు 38 ఉన్నాయన్నారు. అందులో పదింటిని స్థానికులు వినియోగించుకుంటున్నారని.. మిగతా వాటిలో కొన్ని నెలల నుంచి తవ్వకాలు జరగడంలేదన్నారు. స్పందించిన కలెక్టర్‌ తవ్వకాలు జరగకపోవడానికి కారణాలపై పంచాయతీ, గృహ నిర్మాణశాఖల నివేదికలు తీసుకుని ఆయా రీచ్‌ల గుర్తింపును రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, సెబ్‌ ఏఎస్పీ ఆవులయ్య, డీటీసీ కృష్ణవేణి, భూగర్భ జలవనరులశాఖ డీడీ నాగరాజు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నాగిరెడ్డి, జలవనరులశాఖ ఎస్‌ఈ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts