logo

ర్యాంకులతో దూసుకెళ్లారు

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ఏపీ ఎడ్‌సెట్‌-2022, లాసెట్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో నిలిచినవారితో ‘న్యూస్‌టుడే’ మాట్లాడినప్పుడు తమ లక్ష్యాలను

Published : 06 Aug 2022 02:20 IST

ఎడ్‌సెట్‌, లాసెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
-న్యూస్‌టుడే: ఒంగోలు నగరం, కనిగిరి, హనుమంతునిపాడు
 

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ఏపీ ఎడ్‌సెట్‌-2022, లాసెట్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో నిలిచినవారితో ‘న్యూస్‌టుడే’ మాట్లాడినప్పుడు తమ లక్ష్యాలను వివరించారు. 
నాన్న మాదిరే ఉపాధ్యాయ వృత్తి ఇష్టం
- ఇ.వెంకట హర్షిత, ఎడ్‌సెట్‌ 3వ ర్యాంకు

మాది హనుమంతునిపాడు మండలం హాజీపురం. తండ్రి వెంకట కృష్ణారెడ్డి గణిత ఉపాధ్యాయుడు. అమ్మ పద్మ గృహిణి. భవిష్యత్‌లో నాన్న మాదిరి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం నా లక్ష్యం. ఎడ్‌సెట్‌ సోషల్‌ స్టడీస్‌ మెథడాలజీలో 92 మార్కులతో మూడో ర్యాంకు వచ్చింది. ఇప్పటికే టీటీసీ పూర్తి చేశాను. ప్రస్తుతం టెట్‌ రాసేందుకు కూడా శిక్షణ తీసుకుంటున్నాను.  


జాతీయ స్థాయిలోనూ..మెరిశా
- చల్లా రాధిక ఇందు, లాసెట్‌ 4వ ర్యాంకు

ఒంగోలులోని మహేంద్రనగర్‌ ప్రాంతం. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సునీత. అయిదేళ్ల లాకోర్సులో ప్రవేశాల కోసం పద్మావతి విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలో 95 మార్కులతో నాలుగోర్యాంకు వచ్చింది. ఆలిండియా క్లాట్‌ పరీక్షలోనూ  11778 ర్యాంకు వచ్చింది. ఔరంగాబాద్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో సీటు లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ నాకు స్ఫూర్తి. న్యాయమూర్తి కావాలనేది లక్ష్యం.


జూనియర్‌ సివిల్‌ జడ్జి కావడమే లక్ష్యం
- ఇనకొల్లు వెంకట అంజని, లాసెట్‌ 8వ ర్యాంకు

మాది కనిగిరి పట్టణం పాతూరు. నాన్న చిన వెంకట స్వామిరెడ్డి, అమ్మ చెన్నమ్మ. చిన్నప్పటి నుంచి న్యాయవిద్య అంటే ఇష్టం. అందుకు తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. పీజీ ఎల్‌సెట్‌లో 85 మార్కులతో 8వ ర్యాంకు వచ్చింది. నిత్యం ఇంటి వద్దనే ఆరుగంటలు ప్రణాళికాబద్ధంగా ఈ పరీక్షకు సన్నద్ధమయ్యా. జూనియర్‌ సివిల్‌ జడ్జి కావాలన్నది నా లక్ష్యం. ఎంతోమందికి న్యాయ సేవలను చేరువ చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని