logo

ఆ 12 మండలాల్లో లోటు వర్షపాతమే

వర్షాలను బేరీజు వేసుకొని ఖరీఫ్‌ సాగుకు ఉపక్రమించే రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి అయోమయానికి గురవుతున్నారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగా పంటలు వేసిన

Published : 06 Aug 2022 02:20 IST

అయోమయంలో అన్నదాతలు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

ర్షాలను బేరీజు వేసుకొని ఖరీఫ్‌ సాగుకు ఉపక్రమించే రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి అయోమయానికి గురవుతున్నారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగా పంటలు వేసిన రైతులు.. భారీ వర్షాలు కురిస్తే మొక్కలు చనిపోతాయని ఆందోళన చెందుతుంటే.. వానలు తక్కువపడినచోట ఈ దఫా సంప్రదాయ పంటల వైపు మొగ్గుచూపాలా, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలా అన్న సందిగ్ధం నెలకొంది.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన జూన్‌ 1 నుంచి ఆగస్టు 4 వరకు జిల్లాలో వర్షపాతం పరిశీలిస్తే 12 మండలాల్లో లోటు, 11 మండలాల్లో అధికంగా కురిసినట్లు నమోదైంది. 15 మండలాల్లో సాధారణ వర్షపాతానికి అటూ ఇటూగా కురిసింది. ఒంగోలు, దర్శి, సంతనూతలపాడు, కొండపి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మండలాల్లో సాధారణం కంటే తక్కువ కురిసింది. ఈ ప్రాంతాల్లో సుబాబుల్‌, పిల్లిపెసర, నువ్వులు, వరి, కంది, పొగాకు, మిర్చి, వేరుశనగ, మామిడి, ఆముదం, యూకలిఫ్టస్‌ వంటి పంటలు వేస్తుంటారు. ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇదే సమయంలో కనిగిరి, త్రిపురాంతకం, నాగలుప్పలపాడు, హనుమంతునిపాడు, మార్కాపురం, గిద్దలూరు, రాచర్ల, బేస్తవారపేట, కొమరోలు, వెలిగండ్ల, సీఎస్‌పురం తదితర మండలాల్లో సాధారణం కంటే 25-60 మిల్లీమీటర్ల వరకు అధికంగా కురిసింది. ఈ ప్రాంతాల్లో కంది, పెసలు, మిర్చి, వరి, ఆముదం, జొన్న, బత్తాయి, దానిమ్మ, నిమ్మ, పొగాకు తదితర పంటలు వేస్తారు. ఇంతకు మించి కురిస్తే పంట నీట మునిగే ప్రమాదం ఉందని, తెగుళ్లు సోకే అవకాశం ఉందని అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని