logo

పాఠశాలల విలీనంతో ప్రయోజనాలు

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వాటిని గ్రహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు

Published : 06 Aug 2022 02:20 IST

ప్రమాదాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తాం: కలెక్టర్‌

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు సమస్యలు విన్నవిస్తున్న విద్యార్థుల తల్లులు

తాళ్లూరు, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వాటిని గ్రహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం తాళ్లూరు వచ్చిన సందర్భంగా కొందరు మహిళలు ఆయన్ను కలిసి విలీనం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. కిలోమీటరు దూరంలోని పాఠశాలలకు పంపలేకపోతున్నామని, ప్రధాన రహదారుల పైనుంచి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పలువురు అధికారులతో పాఠశాలల విలీనంపై చర్చించారు. ప్రైవేటు పాఠశాలల మాదిరి ఆటోలు వంటి రవాణా వాహనాలు ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని ఎంఈవో సుబ్బయ్యకు సూచించారు. ప్రధాన రహదారుల పక్కన పాదచారులు నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తే పిల్లలకు ప్రమాదాలు జరగవని కొందరు తెలిపారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా వేగ నిరోధకాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ప్రత్యేకాధికారిణి పి.గ్లోరియా, మండల ప్రత్యేకాధికారి ఉపేంద్రకుమార్‌, తహసీల్దారు రామ్మోహరావు, డీటీ రవి, ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, ఎంఈవో సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని