logo

ఏఎన్‌ఎం ఉద్యోగాల పేరిట రూ.12 లక్షలు కాజేశారు

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 97 మంది తమ సమస్యలపై

Published : 09 Aug 2022 01:43 IST

స్పందనలో సమస్యలు వింటున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 97 మంది తమ సమస్యలపై ఎస్పీ గార్గ్‌తో పాటు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఎస్పీ పలువురితో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చట్టపరిధికి లోబడి సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(క్రైమ్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు, ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, ఐసీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

‘జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో ఏఎన్‌ఎం, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. ఆ మొత్తం చెల్లిస్తే ఉద్యోగం మీకే’ అని నమ్మబలికి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసి మోసగించారంటూ ఒంగోలుకు చెందిన ఆర్‌.మాధవి అనే మహిళ పోలీసు స్పందనలో ఎస్పీ మలికా గార్గ్‌కు ఫిర్యాదు చేశారు. కరోనా సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో కొవిడ్‌ సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తనను పత్తి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, పోలిరెడ్డి, నాగేంద్రం అనే వ్యక్తులు ఏఎన్‌ఎం ఉద్యోగం పేరుతో మోసగించారని తెలిపారు. తనతో పాటు మరికొందరి వద్ద రూ.12 లక్షలు వసూలు చేశారన్నారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా.. నగదు ఇవ్వాలని అడిగితే తమను బెదిరిస్తున్నారని వాపోయారు.

చీటీ పాట పేరుతో పొదిలికి చెందిన జి.వెంకట నారాయణ అనే వ్యక్తి నెలకు రూ.20 వేలు చొప్పున రూ.3 లక్షలు కట్టించుకుని పాట పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని దొనకొండ మండలం ఇళ్లచెరువు గ్రామానికి చెందిన ఎం.మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు