logo

సమస్యల పరిష్కారంలో జాప్యం వహించొద్దు

రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం వహించొద్దని అధికారులకు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. జిల్లా కేంద్రం ఒంగోలు ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు

Published : 09 Aug 2022 01:43 IST

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం వహించొద్దని అధికారులకు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. జిల్లా కేంద్రం ఒంగోలు ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్పందన అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు కింద స్థాయి అధికారులు పరిశీలిస్తున్న తీరును ఆయా శాఖల ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో సరళా వందనం, ఎస్‌డీసీలు గ్లోరియా, నారదముని పాల్గొని అర్జీలు స్వీకరించారు. తొలుత జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు.

నాలుగు చక్రాల వాహనం లేకున్నా ఉన్నట్లు సర్వర్‌ చూపుతోందంటూ తన కుమార్తెకు విద్యా దీవెన పథకం కింద ఆర్థిక సాయం నిలిపి వేశారని పుల్లలచెరువుకు చెందిన కార్తీక్‌ జేసీ దృష్టికి తీసుకొచ్చారు.

సర్వే నం.544/1లో తమ భూమికి ఆక్రమణకు గురైందని పామూరుకు చెందిన కొండారెడ్డి వినతి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని