logo

ఉపాధి పేరిట విదేశాలకు పంపేవారిపై జాగ్రత్త

విదేశాల్లో ఉపాధి చూపిస్తామని చెప్పి, డబ్బు కాజేసి మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ సూచించారు. ఇటీవల

Published : 09 Aug 2022 01:43 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉపాధి చూపిస్తామని చెప్పి, డబ్బు కాజేసి మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ సూచించారు. ఇటీవల కాలంలో పెద్దసంఖ్యలో నకిలీ ఏజెన్సీలు దేశంలోని గృహ కార్మికులకు ఉపాధి ఆశచూపి మోసాలకు పాల్పడ్డాయని వివరించారు. భారీ మొత్తాలు కాజేసి చట్టవిరుద్ధంగా కువైట్‌ పంపారని.. పలువురు బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. తమను తిరిగి స్వదేశానికి రప్పించడానికి నకిలీ ఏజెంట్లు భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తున్నారని వారు వాపోయారన్నారు. కొవిడ్‌-19 ప్రయాణ ఆంక్షలను సడలించిన తర్వాత కూడా నకిలీ ఏజెంట్లు ప్రతిరోజూ పెద్దసంఖ్యలో పనిమనుషులను కువైట్‌ తరలిస్తున్నారన్నారు. ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ ద్వారా రిజిస్టర్‌ అయిన ఏజెంట్లు మాత్రమే వీరిని విదేశాలకు పంపవచ్చని తెలిపారు. అలాగే వలస కార్మికులు ఉపాధి వీసాపై మాత్రమే విదేశాలకు వెళ్లవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ చరవాణి నంబర్‌: 9121102104 కు తెలియజేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని