logo

పలు దేవాలయాల్లో చోరీలు

మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన దొంగలను గ్రామస్థులు ఇచ్చిన సమాచారం

Published : 09 Aug 2022 01:43 IST

దొంగలను  పట్టుకున్న పోలీసులు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన దొంగలను గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌కు సమీపంలో టీ దుకాణం వద్ద  ముగ్గురు నిందితులను మార్కాపురం గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం గ్రామీణ ఎస్సై ఆర్‌.సుమన్‌ తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జమ్మనపల్లె గ్రామంలోని ఆంజనేయస్వామి, శివాలయం, కోలభీమునిపాడుకు సమీపంలోని ముద్దసానమ్మ గ్రామ దేవత దేవాలయంలో ఆదివారం గుర్తుతెలియని దొంగలు మూడు దేవాలయాల్లో హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును చోరీ చేసుకొని వెళ్లారని ఆలయ చెందిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్సై సుమన్‌ ఘటన స్థలాలకు చేరుకొని  గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జమ్మనపల్లె గ్రామంలో పోలీసులు గాలిస్తుండగా కోమటికుంట వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారు ఉండే ప్రాంతానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆలయ నిర్వాహకులు మూడు దేవాలయాల్లోని హుండీలో సుమారు రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు, జమ్మనపల్లె శివాలయంలో ఉన్న ఉత్సవవిగ్రహాల చోరీకి విఫలయత్నం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని