logo

5 వేల మంది విద్యార్థులతో జెండా పండగ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జెండా పండగకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఒంగోలు ప్రకాశం భవన్‌, మినీ స్టేడియం ఆవరణలో రెండు స్తూపాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ నెల 14న మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో గుంటూరు

Published : 10 Aug 2022 03:23 IST

ఈ నెల 14న భారీ ప్రదర్శన

కలెక్టరేట్‌లో చేపట్టిన పైలాన్‌ నిర్మాణ పనులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జెండా పండగకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఒంగోలు ప్రకాశం భవన్‌, మినీ స్టేడియం ఆవరణలో రెండు స్తూపాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ నెల 14న మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో గుంటూరు రోడ్డులోని రవిప్రియా మాల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ నుంచి మినీ స్టేడియం వరకు నడక సాగనుంది. దాదాపు 5 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశముంది. ఈ పతాకం సూరత్‌లో తయారుకాగా బుధవారం ఒంగోలుకు తీసుకురానున్నారు. ఇందుకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు కానుంది.

ఇంటింటా సరఫరా:  ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వైఎస్సార్‌ చేయూత, పింఛను లబ్ధిదారులకు డీఆర్డీఏ అధికారులు వీటిని సరఫరా చేయనున్నారు. ఇంటింటా పంపిణీకి 3.70 లక్షల జెండాలు అవసరమని అంచనా. ఇప్పటివరకు లక్ష జెండాలు ఒంగోలు చేరాయి. మిగతావి రాగానే మండల కార్యాలయాలు, అక్కడి నుంచి సచివాలయాలకు పంపిస్తారు. ఏర్పాట్లపై కలెక్టర్‌ బుధవారం అధికారులతో సమీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని