logo

ట్రిపుల్‌ ఐటీలో విష జ్వరాలు

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. గత పదిరోజుల్లో దాదాపు 30 మంది జ్వరాలతో ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఒంగోలు నగరంలోని రావు అండ్‌ నాయుడు, ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలను ట్రిపుల్‌ ఐటీకోసం అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. రెండు ప్రాంగణాల్లో దాదాపు 3 వేల

Published : 10 Aug 2022 03:23 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. గత పదిరోజుల్లో దాదాపు 30 మంది జ్వరాలతో ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఒంగోలు నగరంలోని రావు అండ్‌ నాయుడు, ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలను ట్రిపుల్‌ ఐటీకోసం అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. రెండు ప్రాంగణాల్లో దాదాపు 3 వేల మంది ఉన్నారు. రావు అండ్‌ నాయుడు కళాశాలలో వసతులు సక్రమంగా లేవు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండటంలేదని విద్యార్థులు చెబుతున్నారు. భవనం వెనుక వైపు మురుగంతా నిల్వవుండి దోమల బెడద తీవ్రమైంది. ఆ ప్రాంగణంలో ఎక్కువమంది జ్వరాల బారినపడినట్లు కొందరు విద్యార్థులు ‘న్యూస్‌టుడే’ దృష్టికి తీసుకువచ్చారు. రెండు ప్రాంగణాల్లో ప్రథమ చికిత్స అందించడానికి నర్సింగ్‌ అసిస్టెంట్‌, ఫార్మాసిస్ట్‌ ఉన్నారు. క్లిష్టమైన అనారోగ్య సమస్య వచ్చినవారిని సర్వజన ఆసుపత్రికి పంపిస్తుంటారు. కొంతమంది జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోడానికి అక్కడ వసతి లేదు. జ్వరాలు తగ్గాక మళ్లీ తీసుకొస్తామంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లారు. ట్రిపుల్‌ ఐటీ సంచాలకులు జయరామిరెడ్డిని సమాచారం కోరగా వాతావరణ మార్పు వల్ల కొంతమందికి వైరల్‌ జ్వరాలు వస్తున్నాయని, త్వరగానే కోలుకుంటారన్నారు. ప్రాంగణంలో వైద్య సిబ్బందితో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వరసగా మూడు రోజులు సెలవులు వచ్చినందున తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఇంటికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ కేసులు నమోదు కాలేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు