logo

శవ పరీక్షలో జాప్యం...

త్రిపురాంతకంలో నాలుగు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోదోంతంపై పోలీసుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఓ మహిళ నలభై రోజుల క్రితం కనిపించకుండా పోయిందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు... స్థానిక డీవీఎన్‌

Published : 10 Aug 2022 03:23 IST

వెలికితీసిన చోటే మృతదేహం అవశేషాలు

మార్కాపురం నేర విభాగం, త్రిపురాంతకం : త్రిపురాంతకంలో నాలుగు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోదోంతంపై పోలీసుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఓ మహిళ నలభై రోజుల క్రితం కనిపించకుండా పోయిందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు... స్థానిక డీవీఎన్‌ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు హత్య చేసినట్లు నిర్ధారించారు. ఆ మేరకు ఈ నెల 5న... పూడ్చిపెట్టిన మృతదేహన్ని వెలికి తీయించారు. శవపరీక్ష మాత్రం నేటికీ పూర్తి చేయలేదు. దీంతో వెలికితీసిన మృతదేహం అవశేషాలు ఘటనా స్థలంలో అలానే ఉన్నాయి. పోలీసు సిబ్బంది, బంధువులు నాలుగు రోజులుగా అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. ప్రక్రియ పూర్తికి చొరవ తీసుకోవల్సిన ఉన్నతాధికారులు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతురాలి బంధువులు కోరుతున్నారు. మరో వైపు ఇదే కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి మార్కాపురం న్యాయస్థానంలో మంగళవారం హాజరు పరచగా... న్యాయమూర్తి ఆదినారాయణ పధ్నాలుగు రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని