logo

55,108 మందికి రూ. 35.18 కోట్ల లబ్ధి

జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులకు జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ గురువారం చెక్కు అందజేశారు. ఈ

Published : 12 Aug 2022 02:16 IST

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌.. చిత్రంలో ఓఎంసీ

మేయర్‌ సుజాత, అధికారులు, విద్యార్థులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులకు జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ గురువారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి(ఏప్రిల్‌- జూన్‌ నెల) జిల్లాలోని 55,108 మంది విద్యార్థులు ఈ పథకం కింద రూ.35.18 కోట్ల మేర లబ్ధి పొందినట్లు చెప్పారు. విద్యాదీవెన పథకం అమలుతో ఉన్నత తరగతుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇంటర్న్‌షిప్‌ కూడా కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి అంజలి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని